Tuesday, November 18, 2008

నేను

నేను
ప్రళయ ఘోష ఝాంజా మారుతాన్ని,
హిమవత్ పర్వత శ్రేణి సమున్నతున్ని ,
వర్ష బ్రుతువు లోని మట్టి పరిమళాన్ని,
తల్లి గర్భాన్ని చీల్చుకు పైకి వస్తున్న చెట్టు మొలకను,
నిర్మోహితున్నై ప్రపంచాన్ని నలు దిక్కుల చుస్తున్నవాన్ని  
కడగొట్టు బిడ్డడు కట్టెల పాలైనప్పుడు ఘనీభవించిన దుఃఖాన్ని  

అడగకు నను నీవెవరని ..?
కానరాని దూర తీరాలను కళ్ళు మూసుకొని వెతుక్కొంటున్న వాణ్ణి,
ప్రకోపిస్తున్న మనస్సును పొత్తిళ్ళలో జోకొడుతున్నవాణ్ణి ,
చీమ కాలు విరిగిన శబ్దం విన్తున్నవాన్ని
నది నిశి రేయిలో అక్షరాలను ప్రసవిస్తున్నవాణ్ణి
నేను గమ్యాన్ని, నేను మార్గాని, నేను రక్షకున్ని, నేను అశ్రితున్ని

వ్యధిస్తున్న గుండెలతో మట్లాడగాలిగినవాన్ని
మెత్రొసెక్షువల్ కల్చర్ లో రమిస్తున్నవాన్ని
నిర్మోహిత్తున్ని , నిర్వీర్యున్ని, అంధకారాన్ని, తపః పలాన్ని ,

నేను
విశ్వ సౌందర్యాని, విశ్రాంఖులత్వాన్ని, విలోమ్మాని, వికారాన్ని ,
ముసలి వడుగు చేత మొదట జీవితున్ని చేయభాధవాన్ని  
నా నీడ నన్ను వదిలి వెళ్ళినా నిర్లజ్జగా నిర్గమిస్తున్నవాన్ని,
ఆశల వేటలో, ఆశయాల సాధనలో నన్ను నేను కోల్పోయినవాన్ని


కవి గా మారడం కోసం నన్ను నేను మరిచి పోయిన వాణ్ణి,
లక్షల గొంతుకలను నా నోటితో పలికిస్తున్నవాన్ని,
వ్యదిస్తున్న గుండెలకోసం విలపిస్తున్నవాన్ని ,
నన్ను నేను మరిచి మీకై మీల మరిపోతున్నవాన్ని,
నా అస్తిత్వాన్ని వదిలి మీ ఆశల తీరానికి గానం చేస్తున్న నావికుణ్ణి.

నేను కవిని
నేను మీ కవిని.

 

No comments: